1 August, 2026 | 9:47 PM

రోడ్డు నిర్వాసితులకు న్యాయం చేయాలి

01-08-2026 08:43 PM

ఎల్బీనగర్: హయత్‌నగర్–తారామతిపేట 100 అడుగుల రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ ని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కోరారు.‌ హయత్‌నగర్ మండలం శుభోదయ కాలనీలో హయత్‌నగర్ –తారామతిపేట100 అడుగుల రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మదర్ డెయిరీ సమీపంలో ప్రభుత్వం గతంలో కేటాయించిన 60 గజాల స్థలాల్లో ఇళ్లను నిర్మించుకుని ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణలో తమ ఇళ్లు పూర్తిగా ప్రభావితమవుతున్నాయని, దీంతో వందకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తమ ఇళ్లను కూల్చివేయకుండా ఎదురుగా ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమి వైపు నుంచి రోడ్డు విస్తరణ చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు.