23 May, 2026 | 7:06 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

10-12-2025 02:33 AM

మేడ్చల్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): ‘ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు‘ లో భాగంగా మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడిఓసి) ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ హరిప్రియ, ఆర్డిఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు,  కలెక్టరేట్ సిబ్బంది పాల్గోన్నారు.తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఆలపించిన ప్రభుత్వ ప్రజా పాలన,  సంక్షేమం పై పాడిన పాటలు అందరిని ఎంతగానో అలరించాయి.