2 June, 2026 | 7:53 PM

Breaking News

దమ్మపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎల్లారెడ్డి పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2026 06:53 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల నందు 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ మేధావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం అనేది ప్రజల ఎన్నో దశబ్దాల కల 2014 జూన్ 2 న అది సాకారమై దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఎందరో అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. జూన్ 2 క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు అమరవీరుల సుధీర్ఘ పోరాటానికి సాంస్కృతిక గుర్తింపు అని కొనియాడారు. రాష్ట్ర అవతరణ వెనుక ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, ప్రాణ త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ హెడ్మిస్సెస్ స్వర్ణకుమారి అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.