24 April, 2026 | 4:30 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

24-04-2026 03:00 PM

సామాజికవేత్త జాతీయ బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

దేవరకొండ,(విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సామాజికవేత్త జాతీయ బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల మూడవరోజు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతు తెలిపిన అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆత్మహుతి చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి విషాదకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆత్మహత్యలు వద్దు ఆత్మాభిమానం ముద్దు, తను చాలించకు సమస్యతో తలపడు. అని కార్మికుల లోకానికి చెప్పారు.