7 April, 2026 | 2:15 PM

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!

07-04-2026 12:13 PM
  1. కేరళలో విజయన్... మోదీలా పాలిస్తున్నారు
  2. కేరళ ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది
  3. కేసీఆర్.. విజయన్ కు మంచి మిత్రుడు
  4. తెలంగాణలో కేసీఆర్ ను ఎలా మార్చారో.. కేరళలో కూడా విజయన్ ను మార్చేస్తారు
  5. విజయన్ గాడ్ ఫాదర్ మోదీ... ఢిల్లీలో ఉన్నారు
  6. పినరయి విజయన్ కు కాలం అయిపోయింది

తిరువనంతపురం: కేరళలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy Kerala Election Campaign) ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ, కేరళ మధ్య ఎన్నికలు జరగట్లేదని తెలిపారు. కేరళలో యూడీఎఫ్, ఎల్ డీఎఫ్ మధ్య పోటీ ఉందని పేర్కొన్నారు. పినరయి విజయన్.. కేరళ ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కు తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్(Telangana CM Challenges Kerala CM) విసిరారు. పినరయి విజయన్ తో తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పినరయి విజయన్ కుఆదర్శవంతమైన నేతలు ఎవరూ? అని ప్రశ్నించారు.

పినరయి విజయన్.. మోదీ సూచనలు తీసుకొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో విజయన్.. మోదీలా పాలిస్తున్నారని ఆరోపించారు. కేరళలో యువతను విజయన్ మోసం చేస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసం మోదీలానే విజన్ తనపేరుతోనే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేరళలో ప్రజల నుంచి తనకు ఫీడ్ బ్యాక్ వచ్చిందని వివరించారు. కేసీఆర్... విజయన్  కు మంచి మిత్రుడని, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలన గురించే విజయన్ ప్రస్తావించారని రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణలో కేసీఆర్ ను ఎలా మార్చారో.. కేరళలో కూడా విజయన్ ను మార్చేస్తారని జోస్యం చెప్పారు. విజయన్ గాడ్ ఫాదర్ మోదీ(Narendra Modi ) ఢిల్లీలో ఉన్నారని పేర్కొన్నారు. పినరయికి మోదీ, అమిత్ షా ఆదర్శమా లేకా జ్యోతిబసు ఆదర్శమా? అని రేవంత్ ప్రశ్నించారు. కేరళ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. ప్రభుత్వ మార్పు తథ్యం అన్నారు. మోదీ.. విజయన్ ను కేసుల నుంచి రక్షిస్తున్నారని వెల్లడించారు. మోదీ, విజయన్ మధ్య ఒప్పందం ఉందని పేర్కొన్నారు. కేరళలో సక్సెస్ స్టోరీ విజయన్ పాలనలో వచ్చింది కాదని తెలిపారు. ఉమెన్ చాందీ, కరుణాకరణ్ కేరళ అభివృద్ధి కోసం బాటలు వేశారని గుర్తుచేశారు. పినరయి విజయన్ కాలం అయిపోయిందని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.