సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిరుత పులి దాడి
07-04-2026 02:09 PM
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ లేడు (విజయ క్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ పదవ వార్డు, చిన్నబోనాల పరిసర ప్రాంత రైతులకు తెలియజేయునది ఏమనగా, నిన్నటి రోజున రాత్రి, బోనాల ముత్యంరాజు అనే రైతుకి చెందిన,సుమారు 30వేల విలువ గల దూడ్డె పై , చిరుతపులి దాడి చేసి చంపడం జరిగింది. ఇట్టి సంఘటన చాలా దురదృష్టకారం. పశుపోషణ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఈ రైతుకి,ప్రభుత్వం తక్షణమే ఆదుకొని, నష్టపరిహారం అందించాలని కోరుతున్నాము. అదే విధంగా మన పరిసర ప్రాంత రైతులు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ బొల్గం వైష్ణవి నాగరాజు హెచ్చరించారు.




