తెలంగాణలో గడ్డి మందు నిషేధం
07-04-2026 11:50 AM
సత్తుపల్లి,(విజయక్రాంతి):పంట పొలాల్లో కలుపు మొ క్కల నివారణకు రైతులు విరివిగా వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గడ్డి మందును రాష్ట్రప్రభుత్వం నిషేధించింది, ఈ మందు అమ్మకాలను చట్ట విరుద్ధం గా ప్రకటిస్తూ జీవో నెంబర్ 24 ను విడుదల చేసి ఈ మందు తయారీ నిలువలు పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మందు తక్కువ మోతాదు లో ఉపయోగించిన శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని కూరగాయ లు విషపూరితంగా మారుతున్నాయని వాతావరణం పై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తిం చింది,దీనితో ప్రభుత్వం ఈ గడ్డి మందు పై నిషేధం విధించింది.




