10 May, 2026 | 8:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మ్యానుఫ్యాక్చరింగ్ పవర్‌గా తెలంగాణ

26-02-2026 01:55 AM
  1. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు అవసరం
  2. సీఎం రేవంత్‌రెడ్డితో అడోబ్ సీఈవో శంతను నారాయన్ భేటీ
  3. ఏఐ రెవల్యూషన్, భవిష్యత్‌లో సమర్థవంతంగా ఏఐ వినియోగంపై చర్చ
  4. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు మరింత సహకరించాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూ చించారు. ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. బుధవారం జూబ్లీహిల్స్‌లో సీఎం నివాసంలో అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యులు శంతన్ నారాయణ్ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకం గా కలిశారు.

గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సం దర్భంగా సీఎంతో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీ స్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబో యే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారా యణ్‌తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిం చేం దుకు మరింత సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.