ఇంటర్ ఫలితాల్లో తేజస్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ
కొత్తపల్లి, ఏప్రిల్ 13(విజయక్రాంతి) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ పట్టణం రేకుర్తి లోని తేజస్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎం.పి.సి లో ఎ. కార్తికేయ 470 కి గాను 467 మార్కులు,బి. నివేదన్ 470 కి గాను 467 మార్కులు, పి. సాయి చరణ్ 470 కి గాను 466 మార్కులు,బి. నితిన్ 470 కి గాను 466 మార్కులు,బి. సాయి తేజ 470 కి గాను 465 మార్కులు,కె. నంద కిషోర్ 470 కి గాను 465 మార్కులు, సి.ఇ.సి లో వి. శ్రీ చేతన్ 500 కి గాను 483 మార్కులు,ఎం. వంశీ నాయక్ 500 కి గాను 478 మార్కులు,సి. హెచ్. వరుణ్ తేజ 500 కి గాను 475 మార్కులు, బై.పి.సి లో పి. ఆదిత్య నాయక్ 440 కి గాను 426 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎం.పి.సి లో ఎ. శ్రీవర్ధన్1000 కి గాను 993 మార్కులు, బి. రిషిత్ యాదవ్ 1000 కి గాను 992 మార్కులు,ఎ. నందిశ్వర్ రెడ్డి 1000 కి గాను 992 మార్కులు,ఎం. వర్షిత్ 1000 కి గాను 992 మార్కులు,సి.ఇ.సి లో బి. రామ్ చరణ్ 1000 కి గాను 972 మార్కులు, వై . నవదీప్ 1000 కి గాను 969 మార్కులు,జి. రాజేందర్ 1000 కి గాను 968 మార్కులు, బై.పి.సి లో ఆర్. జగన్ 1000 కి గాను 954 మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్రస్థాయి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులను కళాశాల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు అభినందనలు తెలియజేసారు. తేజస్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాలలో జూన్ లో జరిగే ఆర్మీ, నేవీ నోటిఫికేషన్ లో విద్యార్ధులు అధిక ఉద్యోగాలు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, వీటి కోచింగ్ కొరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని చైర్మన్ సతీష్ రావు తెలిపారు.




