10 August, 2026 | 1:32 AM

దుబ్బతండాలో ఘనంగా తీజ్ పండుగ

10-08-2026 12:08 AM

దామరచర్ల, ఆగస్టు 9 : గిరిజన ఆడబిడ్డల పండుగ తీజ్ పండుగ ను మండలం లోని వీర్లపాలెం గ్రామ పరిధిలోని దుబ్బతండా లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గిరిజన యువతులు ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఈ పండుగ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. రాబోయే భర్త మంచి గుణవంతుడై ఉండాలని,పాడి పంటలు

పశుసంపదలు లా భసాటిగా ఉండాలని కోరుతూ నవధాన్యాలతో బుట్టలో విత్తనాలుగా వేస్తారని అవి ఎంత పచ్చగా పెరిగితే వారి జీవితం అంత పచ్చగా ఉంటదని గిరిజనుల నమ్మకంగా భావిస్తారని చెప్పారు. అట్టి మొలకలకు ఆడబిడ్డలు తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటూ నీళ్ళు పోస్తారని చెప్పారు. ఆరోజుల్లో ఊరంతా పండుగ వాతావరణం నెల కొంటుందని చెప్పారు. ప్రకృతితో ముడిపెట్టిన పవిత్ర పండుగలు కేవలం గిరిజనులకే సొంతమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణి నాగు నాయక్ , ,మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.