నాలుగో టీ20లో ఇంగ్లండ్ ఓటమి l రాణించిన పాండ్యా, హర్షిత్ రానా
పుణే: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆఖరి బంతి దాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనప్పటికీ లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్లు శివమ్ దూబే (53), హార్దిక్ పాండ్యా (53) అర్థసెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (30) పర్వాలేదనిపించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో సఖీబ్ మహ్ముద్ 3 వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్ డకెట్ (39) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో బిష్ణోయి, హర్షిత్ రాణాలు చెరో 3 వికెట్లు పడగొట్టారు.
కాగా బ్యాటింగ్ సమయంలో శివమ్ దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. దీంతో దూబే ఫీల్డింగ్‌కు రాలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3 సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య చివరి టీ20 ఆదివారం జరగనుంది.