calender_icon.png 1 February, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోహ్లీ విఫలం

01-02-2025 01:08:02 AM

ఢిల్లీ: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి  హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అతడి బ్యాటింగ్ చూసేందుకు స్టేడియానికి పోటెత్తిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

కోహ్లీ విఫలమైనప్పటికీ ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుశ్ బదోని (99) సెంచరీ చేజార్చుకోగా.. సుమిత్ మాథుర్ (78 నాటౌట్) అజేయంగా నిలిచాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 326 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (136) సెంచరీ బాదాడు.