9 May, 2026 | 11:24 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

880 మంది టీచర్లకు పదోన్నతులు

22-08-2025 02:05 AM

ఆర్డర్స్‌ను విడుదల చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో  ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేడయంతో పదోన్నతుల ప్రక్రియను అధి కారులు చేపట్టారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కొత్తగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్ ఎం)గా పదోన్నతులు పొందారు. దీనికి సం బంధించిన ఆర్డర్స్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం విడుదల చేశారు.

మేనేజ్‌మెంట్ల వారీగా వివరాలను ప్రకటించారు. మల్టీజోన్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో 53 మం ది, లోకల్‌బాడీ స్కూళ్లలో 437 మంది కలిపి మొత్తం 490 మంది పదోన్నతులు పొందారు. ఇక మల్టీజోన్‌ేొ2 పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో 80 మంది, లోకల్‌బాడీ స్కూళ్లలో 310 మంది కలిపి మొత్తం 390 మంది పదోన్నతులు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 880 మంది ఉపాధ్యాయులు జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందా రు.

పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు పదిహేను రోజులుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను మళ్లీ తిరిగి రీషెడ్యూల్ చేశారు. ఈనెల 26వరకు మొత్తం పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్‌ను విడుడల చేశారు.