ఉపాధ్యాయులు ఉన్నా.. విద్యార్థుల సంఖ్య సున్నా..!
- ఉపాధ్యాయుల మధ్య లోపించిన ఐక్యత
- ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు మధ్య పోరు
- పాఠశాలలో 13 మంది విద్యార్థులకు టీసీలిచ్చిన వైనం
- హెచ్‌ఎంను సస్పెండ్ చేసిన డీఈవో
తుంగతుర్తి, జూలై 17 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని దృక్పథంతో విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ, మెస్ చార్జీలు పెంచి గుణాత్మకమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుంది.
అయితే కొందరు ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇస్తుండడంతో ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపా ధ్యాయుల మధ్య సమన్వయం లోపించి పాఠశాల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితి తుంగతుర్తి మం డలం లోని బండ రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొంది. ఇక్కడ పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయ లోపం విద్యార్థులు జీరో స్థితికి చేర్చడంతో పాటు, ప్రధానోపాధ్యాయున్ని సస్పెన్షన్ అయ్యే వరకు తీసుకువెళ్ళింది.
ఇదీ పాఠశాల పరిస్థితి
బండరామారంలో గల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 2025-26 సంవత్సరం గాను కేవలం 17 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిలో పాఠశాల తెరవగానే 4 విద్యార్థులు వెళ్లిపోయారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో 6 తరగతిలో ముగ్గు రు, 7వ తరగతిలో ఐదుగురు, 8వ తరగతిలో ఐదుగురు, 10వ తరగతి నలుగురు విద్యార్థులు, 9వ తరగతిలో అసలు విద్యార్థులు లేరు. మొత్తం 13 మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు. వీరికి ప్రస్తుతం 5 ఉ పాధ్యాయులు తెలుగు, హిందీ, మ్యాథ్స్, బయోసైన్సు, ఫిజికల్ సైన్సు బోధన చేస్తున్నారు. గడిచిన సంవత్సరం నుండి నేటి వర కు ఇంగ్లీషు, సోషల్ స్టడీల సంబంధించిన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేరు.
ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపం
పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల మధ్య తేడాలు రావడంతో ఒకరి పై మరొకరు, మహిళా ఉపాధ్యాయురాళ్ళు చాడీలు చెప్పుకుంటూ, హెడ్ మాస్టర్ తో, సంబంధాలు తెంచుకొని ఎవరికి వారే య మునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నా రు.
ఈ పరిస్థితి రాను రాను మరింత అద్వాన్నంగా తయారు కావడంతో గతంలో స్థాని క సర్పంచ్ గ్రామంలోని పెద్దమనుషులు, తల్లిదండ్రుల సహకారంతో సద్దుమణిగేలా చేశారు. అయినప్పటికీ పాఠశాలలో ఓ మ హిళా ఉపాధ్యాయురాలు ఆధిపత్యం తారస్థాయికి చేరినట్లు వినికిడి. దీంతో పరిస్థితి తారాస్థాయికి చేరగా హెడ్మాస్టర్ ను ఏ వి ధంగా అయినా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి సృష్టించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
పట్టించుకోని ఎంఈఓ!
అయితే అదే సమయంలో పాఠశాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్నారని స్థానికులు ఎంఈఓ దృ ష్టికి తీసుకెళ్లినా ఏ రకమైన ఆపే చర్యలు తీసుకోలేదని గ్రామస్తులే ఆరోపిస్తుండడం గమనార్హం.
విద్యార్థుల సంఖ్య సున్నా :
పాఠశాలలో ఉన్న 13 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి టీసీలను తీసుకెళ్లగా నే డు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సున్నా అయింది. పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా క్లాస్ రూమ్ లు మొత్తం వెలవెలబోతున్నాయి.
ప్రధానోపాధ్యాయుడి సస్పెండ్ :
పాఠశాల పరిస్థితిపై జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ విచారణ నిర్వహించారు. అలాగే డిఇఓ ఆఫీసులో మహిళా ఉపాధ్యాయురా లు , హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ డీఈఓ కి వినతిపత్రం సైతం అందజేశారు. దీనితో విద్యార్థుల టీసీలు ఇ ష్యూ చేసిన ప్రధానోపాధ్యాయుడు అకీమ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అసలు అసలు పాఠశాలను భ్రష్టు పట్టించడానికి కా రకులైన మహిళా ఉపాధ్యాయురాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హాయి గా ఫోన్లో మాట్లాడుకుంటూ రోజులు గడుపుతుండడం గమనార్హం.
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయాలని లక్ష్యంతో ఉపాధ్యాయులకు లక్షల జీతా లు ఇస్తూ సకల వసతులు కల్పిస్తూ, ప్రభు త్వం ముందుకు సాగుతుంటే ఆయా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండడంతో ప్రభు త్వ లక్ష్యం నీరుగారుతోంది. ఈ పాఠశాలలో విద్యార్థులు జీరోస్థితికి రావడానికి కారకులై న వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే గత సమస్యలు తెలిసి కూడా ఎటువంటి చ ర్యలు తీసుకోలేని ఎంఈఓ, పాఠశాలలో స మస్యలకు ఉపాధ్యాయురాళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీ నా యకులు, గ్రామస్తులు, కోరుతున్నారు.
పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేసేందుకు కృషి చేస్తున్నాం
సంవత్సర కాలం నుండి పాఠశాలలో ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ మధ్య తీవ్రస్థాయిలో తేడాలు వచ్చాయి. దీంతో పరిస్థితి చేయి జారిపోయి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు బూతులు కూడా తిట్టుకున్నట్లు గ్రామస్తులు నాకు ఆరోపించారు. అంతలోనే 13 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడం బాధాకరమైన విషయం. ఈ సంఘటనను స్థానిక ఎంఈఓకు తెలియపరిచిన ఏమీ మాట్లాడకపోవడం బాధాకరం. పాఠశాలలో విద్యార్థులను తిరిగి చేర్పించేందుకు గ్రామస్తులకు కలిసి కృషి చేస్తున్నాను.
కోరికొప్పుల నరేష్ గౌడ్, సర్పంచ్, బండ రామారం






