అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఘటన
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 1: అనుమానస్పద స్థితిలో టీచర్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం చిలుకనగర్ కు చెందిన సతీష్ (27) రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఆరుట్ల మోడల్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.
కాగా ఆయన గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆయన ఉదయం బాత్రూంలో పడిపోయి ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటప స్థలానికి చేరుకుని పరిశీలించగా సతీష్ ఇప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ దవాఖాన తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం చేరుకొని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ తెలిపారు.




