calender_icon.png 8 February, 2026 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ 2047!

25-01-2026 12:04:48 AM

  1. యూనివర్సిటీలు టాప్‌లో ఉండేలా విద్యాశాఖ కార్యాచరణ
  2. రీసెర్చ్‌పైన ప్రత్యేక ఫోకస్
  3. మూడు నెలలకోసారి పనితీరుపై విద్యాశాఖ సమీక్ష

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీలపై ఆ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన యూనివర్సిటీలు మంచి గుర్తింపు సాధించేలా చర్యలు చేపట్టింది. మిగతా యూనివర్సిటీల కంటే మన వర్సిటీలు 2047 కల్లా టాప్‌లో ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఎప్పటికప్పుడు సాంకేతికతను వర్సిటీలు, ప్రొఫెసర్లు అందిపుచ్చుకోవాలని, కేవలం బోధనా, పాఠ్యప్రణాళికలపైనే దృష్టిసారించకుండా వర్సిటీల్లో పరిశోధనలపై కూడా ఫోకస్ చేయాలని విద్యాశాఖ వర్సిటీలకు సూచించింది.

ఈ మేరకు ప్లాన్ అమలు చేయను న్నారు. రాష్ర్టంలోని యూనివర్సిటీలు తమ పనితీరును మార్చుకోనున్నాయి. కేవలం సిలబస్‌పైనే వీసీలు, ప్రొఫెసర్లు దృష్టి పెట్టకుండా కీలక రంగాలైన వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ, రక్షణ, సాంకేతిక, క్లీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించనున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించేలా పరిశోధనలు, పనితీరు ఉండాలని విద్యాశాఖ సూచించింది.

ముఖ్యంగా పరిశ్రమలతో కీలక ఒప్పందాలు, విద్యార్థులకు ప్రాజెక్టులు అప్పగించడం, ఇంటర్న్‌షిప్ లభిం చేలా అప్‌డేట్ అవ్వాలని సూచించింది. పేరుకు పరిశోధనలు, పీహెచ్‌డీలు కాకుం డా ప్రజలకు ఉపయోగపడేలా అవి ఉండే లా కార్యాచరణను వర్సిటీలు ప్రారంభించాలని, డిగ్రీలు ఇచ్చి చేతులు దులు పుకు నేలా కాకుండా ఉద్యోగాలు సృ ష్టించేలా తీర్చిదిద్దనున్నారు. మారుతు న్న సిలబస్, కాలానుగుణంగా లెక్చరర్లు, ప్రొఫెసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, నెలకు ఒకట్రెండుసార్లు కొత్త బోధనా పద్ధతులు, ఏఐ మీద శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.

వర్సిటీల్లోని ప్ర యోగశాలలు ఇతర వర్సటీలు, ఉన్నత విద్యాసంస్థలు ఉపయోగించుకునేలా చర్య లు చేపట్టనున్నారు. ప్రతి యూనివర్సిటీ మూడు నెలల్లో ఏం చేయాలి? ఏం చేసిం ది? సాధించిన ఫలితాలు? కోర్సు వివరాలు? నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్‌తోపాటు ఇతర క్యూఎస్ అంతర్జాతీయ ర్యాంకింగ్‌లోనూ మన వర్సిటీలు మంచి ర్యాంకులు సాధించేలా కార్యాచరణలో ముందుకుపోవాలని విద్యాశాఖ యూనివర్సిటీలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 

ప్రొఫెసర్లు ఏరీ?

వర్సిటీలపై విద్యాశాఖ ఫోకస్ బాగానే ఉన్నా..మన వర్సిటీలు టాప్‌లో ఉండాలంటే ముందు మౌలిక వసతులు, సరిపడా ఫ్యాకల్టీ ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా వర్సిటీల్లో హెచ్‌ఓడీ లే లేని పరిస్థితి ఉంది. అన్ని వర్సిటీల్లో కలిపి దాదాపు 70 నుంచి 80 శాతం ఖాళీలున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే వర్సిటీలను నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యం లో వర్సిటీలు పరిశోధనలపై దృష్టి సారించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.