12 May, 2026 | 3:40 AM

ఆకట్టుకున్న తనుస్వీ నందన నృత్య అరంగేట్రం

12-05-2026 12:03 AM

ముషీరాబాద్, మే 11 (విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు శక్తి పీఠంలో గల మూకాంభిక అమ్మవారి సన్నిధిలో సోమవారం జరిగిన నృత్య అరంగేట్రం కార్యక్రమంలో చిన్నారి తనుస్వీ నందన ఆహుతులను ఎంతగానో అలరించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన సురేశ్, కల్యాణి దంపతుల ప్రథమ పుత్రిక తనుస్వీ నందన చేసిన భరతనాట్య నృత్యం సబికులను ఎంతో ఆకట్టుకుంది.

భరతనాట్యంలో చూపిన ప్రతిభకు చిన్నారిని నిర్వాహకులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. చిన్నారి తనుస్వీ నందన భరతనాట్యంలో రాణించి పలువురి మన్ననలు పొందడం ఎంతో సంతోషంగా ఉందని చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు.