12 May, 2026 | 2:26 AM

చోరీకి పాల్పడింది హైదరాబాద్ దొంగలు

12-05-2026 12:00 AM

శ్లోక మార్ట్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 

50 వేల నగదు, ఆటో స్వాధీనం 

చోరీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్.. మరొకరు పరారీలో 

కేసును చేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ 

కామారెడ్డి, మే 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల  శ్లోక మార్ట్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్లోక మార్ట్ చోరీ కేసు, నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.

హైదరాబాద్ నుంచి ఆటోల వచ్చి వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇటీవల కామారెడ్డి సిరిసిల్ల రోడ్ లోని శ్లోక మార్టులో జరిగిన దొంగతనం కేసును చేదించారు. సీసీటీవీ సాంకేతికత ఆధారాలతో కామారెడ్డి పట్టణంలో కేసు చేదించినట్లు ఎస్పీ తెలిపారు. ఈనెల 7న శ్లోకా మార్ట్ ఉద్యోగి రాత్రి పది గంటలకు దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా షాప్ షెటర్ తాళాలు ప గలగోట్టి ఉండడంతో శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ కు చెందిన షేక్ ఇర్ఫాన్, మరో ఇద్దరు జ్వునల్ నిందితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. మార్ట్ లో  చొరబడి కౌంటర్ లో ఉన్న 50 వేల నగదు దోచుకెళ్లారు. మళ్లీ కామారెడ్డికి తిరిగి వచ్చి సోమవారం మరోచోట చోరికి రిక్కీ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. శ్లోక మార్ట్ లో చోరీకి పాల్పడినట్లు నిందితులోపుకున్నట్లు వారిలో ఒకరు పరాల్లో ఉన్నట్లు తెలిపారు.

మీరు గతంలో మీరు చౌక్లో ద్విచక్ర వాహనం, డ బిల్ పూర్, అఫ్జల్ గంజ్ల్లో రాబడి కేసుల్లో షేక్ ఇర్ఫాన్, నిందితుడు కాగా చందానగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులలో జ్వునల్  నిందితుడు కాగా మరో జువైనల్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అంతర్ జిల్లా దొంగల ముఠా ను పట్టుకోవడంలో కామారెడ్డి పట్టణ సిఐ నరహరి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్, ఎస్త్స్రలు ఉస్మాన్ నాగరాజు సాయికిరణ్ తో పాటు పోలీస్ సిబ్బంది రంగారావు కమలాకర్ రాజు సంపత్ రామస్వామి మైసయ్య స్వామి శ్రీనివాసులు జిల్లా ఎస్పీ అభినందించారు. సమన్వయంతో అప్రమత్తతో సమతవంత దర్యాప్తుతో కేసును త్వరితగతిన ఛేదించబడిందని ఎస్పీ తెలిపారు.