మేడ్చల్ జిల్లాలో తల్లి ఒడి కేంద్రాలు ప్రారంభం
మేడ్చల్, మార్చి 9 (విజయ క్రాంతి): బాలింతలు ప్రయాణంలో తమ శిశువులకు పాలు ఇవ్వడానికి వీలుగా మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తల్లి ఒడి కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేడ్చల్ బస్టాండ్, మల్కాజిగిరి రైల్వే స్టేషన్, నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వీటిని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రదేశాలలో బాలింతలు తమ శిశువులకు పాలు ఇవ్వడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి.
మేడ్చల్ బస్టాండులో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వద్ద డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ, నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్సీ పిసిఆర్ సభ్యులు తల్లి ఒడి కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ డబ్ల్యూ ఓ, సంబంధిత అధికారులు, జిల్లా మహిళా సంక్షేమ అధికారి, మహిళ దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి పాల్గొన్నారు.




