దిల్వార్పూర్ కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
12-04-2026 05:34 PM
నిర్మల్,(విజయక్రాంతి): దిల్వార్పూర్ కేజీబీవీ విద్యార్థులు ఇంటర్ ఫలితాలు ప్రతిభ సాధించినట్లు ఎస్ఓ అపర్ణ తెలిపారు. కళాశాలలో చదువుతున్న బైపీసీలో అర్చన 991, ఎంపీసీలో శైలజ 943 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు బైపీసీలో నాన్సీ, 430 ఎంపీసీలో పూజ 450 మార్కులు సాధించినట్టు తెలిపారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.




