14 July, 2026 | 6:53 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

పసుపు బియ్యం పట్టండి!

17-12-2025 01:15 AM
  1. లేకుంటే డబ్బులు వాపస్ ఇవ్వండి
  2. ఓటర్లతో ఓడిన సర్పంచ్ అభ్యర్థి వ్యవహారం
  3. ఆసిఫాబాద్ జిల్లా బాలాజీ అనుకోడలో ఘటన 

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్16 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిన అభ్యర్థి.. తనకే ఓటేశారని పుసుపు బియ్యం పట్టాలని, లేదంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేసిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామంలో చో టుచేసుకుంది. గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

ఈ నెల 14న జరిగిన రెండో విడత పోలింగ్‌లో వెలువడిన ఫలితాల్లో ఆయన ఓడిపోయాడు. మంగళవారం ఆ యన తన భార్యతో కలిసి గ్రామంలోని పలు వాడల్లో తిరిగాడు. తాను ఓట్ల కోసం డబ్బు లు ఇచ్చానని, డబ్బులు తీసుకున్న వారు ఓటు వేయకపోవడం వల్లే ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనకు ఓటు వేసిన వారు పసుపు బియ్యం పట్టుకోవాలని, అలా చేయని వారు తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఓటర్ల ఇళ్లకు వెళ్లి అడిగాడు. ఓటు వేసిన వారు పసుపు బియ్యం పట్టిస్తే సరిపోతుందని, పసుపు బియ్యం పట్టని వారు మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ సంఘటన స్థా నికంగా కలకలం రేపగా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించ డంపై చర్చ జరుగుతోంది.