12 March, 2026 | 3:27 AM

పరీక్షల విరామం సద్వినియోగం చేసుకోవాలి

12-03-2026 12:05 AM

కోదాడ, మార్చి 11: రాష్ట్రంలో మొదటిసారిగా పదవ తరగతి పరీక్షలు విరామంతో నిర్వహించబడుతున్నాయని, విరామాన్ని సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలు సాధించాలని సీనియర్ ఉపాధ్యాయుడు, మోటివేషనల్ స్పీకర్ బడుగుల సైదులు అన్నారు. కోదాడ శివారు బాలాజీనగర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏర్పాటుచేసిన పరీక్షల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసి సత్ఫలితాలు సాధించాలి, సమయ ప్రణాళికను పాటించటం తో పాటు పౌష్టికాహారం సరిపడా నిద్ర   ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్  కె .నాగజ్యోతి, ఉపాధ్యాయనీలు స్వాతి, సుజాత  విద్యార్థినిలు పాల్గొన్నారు.