15 June, 2026 | 7:21 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

సమ్మర్ స్పెషల్ ‘స్విమ్మింగ్’..- జాగ్రత్త సుమా..

04-04-2026 12:55 AM

-చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం

వెంకటాపూర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రత పెరిగిపోతుంది. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఇంట్లోనే ఉండి చల్లని గాలిని ఆస్వాదిస్తారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, యువత మాత్రం చెరువులు, బావులు, కాలువల్లో ఈత కొట్టేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

రామప్ప చెరువు వద్ద ఈత సందడి

వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం సమీపంలో ఉన్న రామప్ప సరస్సు వేసవిలో సందడిగా మారుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి సరస్సు కాలువల్లో ఈత కొడుతూ వేడిని తగ్గించుకుంటారు. సమ్మర్ అంటే చాలా మందికి రామప్ప సరస్సే గుర్తుకు వచ్చే స్థాయిలో ఇది ప్రసిద్ధి చెందింది.

సరదా ప్రాణాలకు ప్రమాదం కావొచ్చు

అయితే ఈ సరదా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి దారితీస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి.

సమ్మర్లో ఈత.. ప్రాణాలకు ముప్పు: -ఎస్త్స్ర చల్లా రాజు

వేసవి కాలంలో పిల్లలు, యువత చెరువులు, బావులు, కాలువల్లో ఈతకు వెళ్లేట ప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈత రాని వారు నీళ్లలోకి దిగకూడదని, లోతు తెలియని ప్రదేశాల్లో ఈత కొట్టడం ప్రమాదకరం. వేసవి సెలవుల్లో చిన్నారులు సరదా కోసం స్నేహితులతో కలిసి కుంట, చెరువుల్లో ఈతకు వెళ్లొద్దు. తమ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, తమ పిల్లలను ఈతకు పంపించవద్దు. ప్రతి సంవత్సరం నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న తప్పిదం కూడా ప్రాణ నష్టానికి దారితీస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచి, వారు ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి. అలాగే, ప్రమాదకర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలి. ‘అప్రమత్తతే ప్రాణ రక్షణకు మార్గం అని పేర్కొన్నారు.