అచ్చంపేట ఎంఈఓపై సస్పెన్షన్ వేటు
- ఎలాంటి అనుమతులు లేకుండానే సమావేశానికి గైర్హాజరు
- ఆగ్రహించిన కలెక్టర్
- మరో 12 మంది స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు గైర్హాజరు వారి స్థానంలో కిందిస్థాయి సిబ్బంది హాజరు.. సమావేశం నుంచి బయటికి గెంటివేత
నాగర్ కర్నూల్, మే 22 (విజయక్రాంతి): బడిబాట సన్నాహక సమావేశానికి గైర్హాజరైన అచ్చంపేట ఎంఈఓ జీవన్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. మరో 12 మంది స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు గైర్హాజరవుతూ వారి స్థానంలో కిందిస్థాయి సిబ్బందిని పంపడంపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి నిర్దాక్షిణ్యంగా కిందిస్థాయి సిబ్బందిని బయటికి పంపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన బడిబాట సమావేశ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టే బడిబాట కార్యక్రమానికి ముందస్తు సన్నాక సమావేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కానీ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకుండానే గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ధ్రువీకరించారు. 12 ఏళ్ల లోపు చిన్నారులను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. బడి బయట ఉన్న పిల్లల వివరాలను గుర్తించి బడిలో చేర్పించడంతోపాటు అంగన్వాడి నుండి విద్యార్థులను ఆయా పాఠశాలలకు చేర్చేందుకు అధికారులు పనిచేయాలన్నారు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.






