7 June, 2026 | 8:02 PM

రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. 11న స్పష్టత

07-06-2026 06:49 PM

చెన్నై: ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్న ఊహాగానాలపై నటుడు, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత రాఘవ లారెన్స్ స్పందించారు. ఈ సందర్బంగా లారెస్స్ తెలిపిన వివరాల ప్రకారం... తాను తిరుచ్చి అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ప్రస్తావించారు. ఈ ఊహాగానాలు పెరుగుతుండటంతో పలువురు మీడియా మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారని, తిరుచ్చిలో పోటీ వార్తాలపై జవాబివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రస్తుతం బెంబ్ సినిమా ఘూటింగ్ లో బిజీగా ఉన్నానని, ఆ షెడ్యూల్ జూన్ 10న పూర్తవుతుందన్నారు. మా అమ్మ ఆశీస్సులతో, నా జీవితానికి సంబంధించిన కీలక  నిర్ణయాన్ని జూన్ 11న గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. విజయ్ రాజీనామాతో ప్రస్తుతం తిరుచ్చి నియోజకవర్గం ఖాళీ అయింది. రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారా లేదా తన ప్రజా జీవితానికి సంబంధించిన మరో కీలక ప్రకటన చేయబోతున్నారా అనే విషయంలో ఈ పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఆయన ఎటువంటి ప్రణాళికలనూ స్పష్టం చేయకుండా, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని తన అనుచరులను కోరారు.