లొంగిపోండి
ఇక క్యూబా పనిపడతాం!
ఇరాన్ నాయకత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
న్యూఢిల్లీ, మార్చి 6: ఇరాన్‌తో అణు ఒప్పందంతో సహా ఎటువంటి చర్చలు ఉండవని, ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌లోని ప్రస్తుత నాయకత్వం లొంగిపోయిన తర్వాత, అక్కడ అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక జరుగుతుందన్నారు. భాగస్వా మ్య పక్షాలతో కలిసి ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటపడేస్తామని ట్రంప్ చెప్పారు.
గతంలో లేనివిధంగా ఇరాన్‌ను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఇరాన్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని, ‘మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్’ దిశగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు ట్రంప్, ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు పెట్టారు. ఇరాన్ రాజకీయ భవిష్యత్‌పై తను పత్యేక్షంగా కలుగజేసుకుంటానని ఈ ప్రకటన ద్వారా ట్రంప్ స్పష్టం చేశారు.
ఉరుముతున్న యుద్ధం
9న వివిధ దేశాధినేతలతో ఈయూ చర్చలు
మేము శాంతికి కట్టుబడి ఉన్నాం: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్
ఏడు రోజుల దాడుల్లో 1,459 మంది మృతి
వాషింగ్టన్/ టెహ్రాన్, మార్చి 6: ఇజ్రాయెల్ టెహ్రాన్, ఇస్ఫహాన్‌పై భీకర దాడుల తో విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తూ, క్షిపణులను ప్రయోగిస్తూ.. ఇరాన్ సైనిక స్థావరాలను, బంకర్లను విధ్వంసం చే స్తోంది. మరోపక్క ఇరాన్ గల్ఫ్‌లోని యూ ఎస్ స్థావరాలపై కొత్త దాడి ప్రారంభించిం ది. ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలపై ఇరా న్ తాజా క్షిపణులను ప్రయోగిస్తోంది. దీం తో బాంబుల దాడులతో పశ్చిమ ఆసియా మార్మోగుతోంది. రోజురోజుకూ దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ యూఎస్, ఇరాన్ సైన్యాలు పెంచుతుండడంతో యుద్ధం ఉగ్రరూపం దాల్చు తోంది.
ఇజ్రాయెల్ వచ్చే దాడులను అడ్డుకుంది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థానాలను కూడా తాకాయి. అక్కడ కనీసం 8 మంది మరణించారు. ఈ ఏడురోజుల దాడుల్లో ఇరాన్‌లో 1,230 మందికి పైగా, లెబనాన్లో 217 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 12మందికి పైగా మరణించారు. 6 యూఎస్‌సైనికులు మృతిచెందారు. ఇరాన్ ప్రతీకార దాడుల తర్వాత కువైట్లోని యూఎస్ రాయబార కార్యాలయం మూసివేశారు.
ఈ పోరాటం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. చమురు ధరలు భగ్గును మండుతున్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ మందగించింది. అయితే యూఎస్ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఇరాన్ తదుపరి నాయకత్వాన్ని ప్రభావితం చేయడంలో నిమగ్నమయ్యారు.
9న దేశాధినేతలతో ఈయూ చర్చలు
పశ్చిమాసియాలో యూఎస్ ఇరాన్ మధ్య భీకర దాడుల నేప థ్యంలో సోమవారం ఆయా దేశాధినేతలతో యూరోపియన్ యూనియన్(ఈయూ) చర్చలు జరపనుంది. తీవ్రమవుతున్న సంక్షోభాన్ని ఎలా ముగించాలనే దానిపై ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మాట్లాడుకోనున్నారు.
మేము శాంతికి కట్టుబడి ఉన్నాం: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్
మేము శాంతికి కట్టుబడి ఉన్నామని, అయితే, దేశ గౌరవాన్ని కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. మధ్యప్రాచ్యం లో పెరుగుతున్న సంఘర్షణ మధ్య, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడు తూ, కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయని తెలిపారు. వారి ప్రయత్నాలను స్వాగతిస్తూ, ఇరాన్ ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహ రిస్తే శాంతికి అంగీకరించబోమని ఆయన చెప్పారు. ఇరాన్ పాలన కూడా దేశ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పు డూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
రష్యన్ గ్యాస్‌కు రావద్దు : ఐఈఏ చీఫ్
యూఎస్ ఇరాన్- మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల ప్ర పంచ ఎల్‌ఎన్‌జీ పెరుగుదల మధ్య రష్యన్ గ్యాస్‌కు తిరిగి రావద్దని ఐఈఏ చీఫ్ హెచ్చరించారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ శుక్రవారం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరా వ స్తున్నందున, గ్యాస్ సరఫరాల కోసం రష్యా వైపు చూడటం ఆర్థికంగా, రాజకీయంగా తప్పు అని పేర్కొన్నారు.
‘మధ్యప్రాచ్యంలో ప్రస్తుత సంక్షోభం రష్యాకు తిరిగి వెళ్లాలా వద్దా అనే దానిపై కొన్ని వర్గాలలో ప్రశ్నలకు దారితీసింది’ అని బిరోల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఈయూ కమిషనర్ల సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు. ఇంతలో, మధ్యప్రాచ్య వి వాదం ప్రారంభమైనప్పటి నుంచి దేశ ఇం ధన ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరిగిందని రష్యా పేర్కొంది. రష్యా చమురు కొను గోలు కోసం భారతదేశానికి 30 రోజుల మినహాయింపును అమెరికా అనుమతించిన తర్వాత డిమాండ్లు కూడా పెరిగాయి.
యూఎస్‌పై రగలిపోతున్న ఇరాన్
ఇరాన్ దేశ నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా త్వరలోనే ఘోరంగా చింతించాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఇప్పటికే ఖతార్‌లోని భారీ శక్తివంతమైన రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేసింది.
భారత సిరామిక్, టైల్స్‌పై ప్రభావం
మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమవుతున్నందున భారతదేశ సిరామిక్, టైల్స్ పరిశ్రమ కష్ట సమయాన్ని ఎదుర్కొంటుంది. ఇరాన్‌పై అమెరికా- వైమానిక దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రమవుతోంది. దీంతో భారతదేశంలోని సిరామిక్, టైల్ పరిశ్రమ కష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇంధన రవాణాకు గణనీయంగా అంతరాయం కలిగించింది. తన బట్టీలను కాల్చడానికి ప్రొపేన్, సహజ వాయువుపై ఎక్కువగా ఆధారపడే రూ.650 బిలియన్ల పరిశ్రమ కష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది.
1,459 మంది మృతి
ఇరాన్‌లో కనీసం 1230 మంది, లెబనాన్‌లో 217 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. యూఎస్‌కు చెందిన ఆరుగురు సైనికులు కూడా మృతిచెందారని తెలిపారు. సోమవారం నుంచి లెబనాన్‌లో మరణాల సంఖ్య 217కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 798 మంది తీవ్రంగా గాయడినట్లు తెలింది.
పరిస్థితులు ఉద్రిక్తం అవుతుండడంతో కువైట్ సిటీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు. అమెరికన్ పౌరుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు.




