calender_icon.png 17 February, 2026 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీనటి ప్రత్యూష మృతి కేసులో 'సుప్రీం' కీలక తీర్పు

17-02-2026 11:17:06 AM

న్యూఢిల్లీ: సినీ నటి ప్రత్యూష మృతి( Actress Pratyusha death case) కేసులో సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక తీర్పు(Supreme Court) వెల్లడించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. రెండు దాశాద్దాల క్రితం సంచలనం రేపిన నటి ప్రత్యూష మృతి కేసు హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.

శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజిని దేవి దాఖాలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై గతేడాది సుప్రీం ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తి అయిన తర్వాత ప్రత్యూష చిత్రపరిశ్రమలోకి వెళ్లిగా, సిద్ధార్థ రెడ్డి ఇంజినీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం విషం తాగిన పరిస్థితిలో ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ప్రత్యూష 24న మృతి చెందింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇద్దరు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు వైద్యులు గుర్తించారు.