calender_icon.png 18 February, 2026 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ రిలేట్ అయ్యేలా బూకీ

18-02-2026 12:00:00 AM

అజయ్ దిషన్, ధనుషా హీరోహీరోయిన్లుగా గణేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్‌నర్ ‘బూకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణను దక్కించుకుంది. ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో అజయ్ దిషన్ మాట్లాడుతూ.. “హీరోగా నేను చేస్తున్న ఫస్ట్ సినిమా ‘బూకీ’. ఇందులో అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా లైఫ్‌నే సినిమాగా తీస్తున్నట్టు అనిపించింది” అని తెలిపారు. హీరోయిన్ ధనుషా మాట్లాడుతూ.. “నాకు తెలుగు కొంచెం తెలుసు.  మా అమ్మది తిరుపతి. ఇది నా ఫస్ట్ సినిమా.

ఇది నాకు చాలా పెద్ద అవకాశం. తమిళ్‌తోపాటు తెలుగులో కూడా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు. ‘ఈ సినిమా తమిళ్ కంటే తెలుగులో బావుంద’ని డైరెక్టర్ గణేశ్‌చంద్ర తెలిపారు. ‘ఈ సినిమా అంతా రిలేట్ చేసుకునేలా ఉంటుంది. క్లుమైక్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయ’ని మూవీ ప్రజెంటర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ చెప్పారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “ఇది యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా. ఇందులో చాలా ఆసక్తికరమైన క్యారెక్టర్ చేశా. ఇది యూత్ ఫుల్ సినిమా” అన్నారు. రైటర్ భాష్యశ్రీ, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.