9 April, 2026 | 5:01 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

ఆరావళిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

29-12-2025 03:01 PM

న్యూఢిల్లీ: ఆరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చి ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 100 మీటర్లలోపు ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్ కు గతంలో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేఐ ధర్మాసనం తదుపరి ఉత్తర్వుల వరకూ గత ఆదేశాలను నిలిపివేసింది. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. సుప్రీంకోర్టు ఆరావళిపై(Aravalli) వివాదం దృష్ట్యా సుమోటోగా విచారించింది. పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. నాలుగు రాష్ట్రాల సీఎస్ లను కమిటీలో సభ్యులుగా చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.