30 June, 2026 | 9:44 PM

Breaking News

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •  

డిజిటల్ అరెస్టు కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

27-10-2025 04:58 PM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల సంఘటనలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు కేసులపై విచారణ కోసం ప్రణాళికతో రావాలని సీబీఐని ఆదేశించిన జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం అవసరమైతే సైబర్ నిపుణుల సాయం తీసుకొని డిజిటల్ అరెస్టు కేసుల వివరాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ...  ఇప్పటికే ఇలాంటి కొన్ని కేసులను విచారిస్తున్న సీబీఐకి వనరులు ఉన్నాయో లేదో కనుక్కోండని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల వాదనలు వినకుండా ఏకరీతి దర్యాప్తును కోరుకుంటున్నామని, అయితే ఈరోజు ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం తెలిపింది.

అంతకుముందు, సుప్రీం కోర్టు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల సంఘటనలను సుమోటోగా స్వీకరించింది. ఇక్కడ మోసగాళ్ళు చట్ట అమలు సంస్థలు లేదా న్యాయ అధికారుల వలె నటించి పౌరుల నుండి, సీనియర్ సిటిజన్ల నుండి డబ్బును దోచుకుంటారు. నకిలీ సంతకాలతో కూడిన న్యాయపరమైన ఉత్తర్వులను రూపొందించడం న్యాయ వ్యవస్థ, చట్ట పాలనపై ప్రజల నమ్మకానికి పునాదిని దెబ్బతీస్తుందని అత్యున్నత న్యాయస్థానం మునుపటి విచారణలో పేర్కొంది.