31 May, 2026 | 9:16 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

గ్రూప్ నియామకాల్లో జోక్యం చేసుకోబోం

03-04-2026 02:05 AM

హైకోర్టు తీర్పుపై స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

వాదనలు విన్నాక పిటిషన్ డిస్మిస్

హైదరాబాద్, ఏప్రిల్ 2 : ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో తప్పులున్నాయని, నోటిఫికేషన్ రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు.

విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు కనిపించలేదని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పునిచ్చిందని కోర్టుకు వివరించారు. మూడుసార్లు మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్రమాలకు తావులేకుండా నియామక ప్రక్రియ చేపట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.