31 May, 2026 | 8:25 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

సెమీస్‌లో నిఖత్ జరీన్

04-04-2026 01:25 AM

ఆసియా చాంపియన్ షిప్‌లో ఖాయమైన పతకం

మంగోలియా: తెలంగాణ బాక్స ర్, మాజీ వరల్డ్ చాంపియన్ నిఖ త్ జరీన్ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతోంది. తన ఫామ్ కొనసాగిస్తూ సెమీఫైనల్ కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగం లో బరిలోకి దిగిన నిఖత్ క్వార్టర్ ఫైనల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జియా న్ బగుహిన్‌పై విజయం సాధించింది.

తొలి రౌండ్‌లో బై పొందిన ఆమె క్వార్టర్స్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో రిఫరీ తొలి రౌండ్‌లోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్ గెలిచినట్టు ప్రకటించారు. సెమీ స్‌లో నిఖత్‌కు గట్టి సవాలే ఎదురుకానుంది. పారిస్ ఒలింపిక్స్ గోల్ మెడలిస్ట్, చైనా బాక్స ర్ వు యూతో నిఖత్ తలపడనుంది. సెమీస్‌లో ఓడితే కాంస్యం గెలుస్తుంది.