27 April, 2026 | 11:47 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు పట్టం కట్టండి

29-11-2025 04:54 PM

కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి..

జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డవేని గోపి..

బోయినపల్లి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలు కేంద్రం ఇచ్చే నిధులతోనే కొనసాగుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డవేని గోపి చెప్పారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బిజెపి కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలందరూ ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు ఏ విధంగా వచ్చాయో ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినారో కూడా ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చే నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితిలో ఈ ఎన్నికలు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు  5లక్షలు ఇస్తామని చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద గ్రామ పంచాయతులకు నిధులు ఇచ్చేందుకు డబ్బులు లేవని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీ పాలన కొనసాగుతుందని అని చెప్పారు. అందుకు బిజెపి అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల బిజెపి అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం, సీనియర్ నాయకులు క్యాతం తిరుపతిరెడ్డి, మండల నాయకులు గుడి రవీందర్ రెడ్డి, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహ చారి, జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి , సారంపల్లి రాజు, కొండం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.