5 May, 2026 | 7:15 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మద్దతు ఇవ్వండి

09-02-2026 01:54 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపు

ముషీరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. ఓటు మనదే  సీటు మనదే, బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ ఓటర్లు ఐక్యం గా ముందుకు రావాలని ఆయన సూచించారు.

ఈ మేరకు ఆదివారం హైదరాబా ద్లోని బీసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ  రాష్ట్రంలోని 116 ము న్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలను బీసీల రాజకీయ ఐక్యతను ప్రదర్శించే వేదికగా మార్చుకోవాలని కోరారు.

జనరల్ స్థానాలు ఏకపక్షంగా కొన్ని వర్గాలకు మాత్రమే కేటాయించినవి కాదని, రిజర్వేషన్లు లేని చోట పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయంగా న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడి యా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా సెక్రటరీ సూర్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జెల్ల నరేందర్, మరపంగు వెంకన్న, కర్నాటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.