09-02-2026 01:54:43 AM
వేములవాడ,8 ఫిబ్రవరి ( విజయక్రాంతి)వేములవాడ మున్సిపల్ ఎన్నికల ముఖ చిత్రం ఇప్పుడు యావత్ పట్టణం దృష్టిని ఆకర్షిస్తోంది, ముఖ్యంగా 21వ వార్డులో రాజకీయ వాతావరణం మునుపెన్నడూ లే నంతగా వేడెక్కి బిఆర్‌ఎస్ అభ్యర్థి నరాల శేఖర్ వైపు ఏకపక్షంగా మారుతోంది. గత పదేళ్లుగా ఈ వార్డుతో నరాల కుటుంబానికి ఉన్న విడదీయలేని అనుబంధం, ప్రజా సే వలో వారు కనబరిచిన అంకితభావమే నే డు శేఖర్ను గెలుపు తీరాలకు చేరువ చేస్తున్నా యి.
కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నాయకుడిలా కాకుండా, గత దశాబ్ద కాలం గా వార్డు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి కావడమే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. మొదట తన భార్య సౌజన్య ఐదేళ్ల కాలంలో మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేయగా, ఆ తర్వాత ఐదేళ్లు కౌన్సిలర్గా శేఖర్ వార్డును అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం, బురదమయంగా ఉన్న వీధులను సీసీ రోడ్లుగా మార్చడం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం వంటి పనులు శేఖర్ మార్కు అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
నియోజకవర్గ స్థాయిలో బలమైన పట్టున్న కేటీఆర్ స్వయంగా నరాల శేఖర్ పనితీరును ప్రశంసించడం, వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడని కితాబివ్వడం సామాన్య ఓటర్లలో సైతం భరోసాను పెంచింది. చల్మెడ లక్ష్మీనరసింహరావు, పొలాస నరేందర్ వంటి అగ్రనేతలు శేఖర్ వెంటే ఉండి ప్రచారంలో పాల్గొనడం ప్రత్యర్థులకు గట్టి సవాలుగా మారింది.
ఏ అర్ధరాత్రి ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా, మరేదైనా ఆపద తలెత్తినా వెంటనే స్పందించే గుణం శేఖర్ను ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ వంటివి ప్రతి గడపకూ చేరేలా ఆయన చేసిన నిరంతర పోరాటం నేడు ఓట్ల రూపంలో మారుతోంది.
ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని, మహిళలకు స్వయం ఉపాధి మరియు యువతకు ఉపాధి అవకాశాల కల్పనే తన తదుపరి ప్రాధాన్యత అని ఆయన ఇస్తున్న హామీలు ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వార్డులోని ప్రతి వీధిలోనూ, ప్రతి కార్నర్ మీటింగ్లోనూ జనసందోహం పోటెత్తుతుండటం చూస్తుం టే, ఇతర పార్టీల అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితు లను, క్షేత్రస్థాయి సమీకరణాలను విశ్లేషిస్తే 21వ వార్డులో నరాల శేఖర్ హ్యాట్రిక్ విజ యం సాధించడం కేవలం లాంఛనమేనని, అత్యధిక మెజారిటీతో ఆయన కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.