1 August, 2026 | 2:14 PM

కంట్లో కారం చల్లి.. వేటకొడవళ్ళతో నరికి..

01-08-2026 12:43 PM

పెంట్లవల్లిలో ఆర్.ఎం.పి వైద్యుడి దారుణ హత్య.

భూ వివాదమే కారణం అంటున్న స్థానికులు.

పెంట్లవెల్లి: భూ వివాదం కారణంగా గ్రామంలోని ఆర్ఎంపి వైద్యుడిపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం చల్లి వేట కొడవళ్ళతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూల్ ప్రాంతానికి చెందిన మల్లయ్య చాలా కాలంగా పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఆర్.ఎం.పి క్లినిక్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరి వ్యక్తుల మధ్య భూ వివాదం కొనసాగుతోందని ఈ క్రమంలోనే విసిగి వేసాగిన ఆ కుటుంబం గురువారం రాత్రి నలుగురు వ్యక్తులు క్లినిక్ వద్దకు వెళ్లి మల్లయ్య కంట్లో కారం చల్లి వేట కొడవళ్ళతో తీవ్రంగా గాయపరిచారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు