09-02-2026 01:56:27 AM
ముకరంపుర, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 42 వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్, బీజేపీ నాయకులు యాదగిరి సునీల్ రావు డివిజన్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి భారతీయ జనతా పార్టీ నీ గెలిపించాలని ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ కూడా కరీంనగర్ నగర అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే కేంద్ర నుండి వరదలా నిధులు వచ్చి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తున్నదని భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని సునీల్ రావు పేర్కొన్నారు.