1 August, 2026 | 1:36 PM

Vijayakranthi Effect: వాటర్ ట్యాంక్ పరిసరాలు శుభ్రం

01-08-2026 12:28 PM

కాలనీవాసుల హర్షం

భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఎస్టీ కాలనీ రహదారి(ST Colony Road) పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ చుట్టూ చెత్తకుప్పలతో అస్తవ్యస్తంగా దర్శనమివ్వగా జూలై 29న 'పడకేసిన పారిశుద్ధ్యం ' అనే శీర్షికన విజయక్రాంతిలో(Vijayakranthi Effect) కథనం ప్రచురితమైంది. స్పందించిన గ్రామపంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి వాటర్ ట్యాంక్ వద్ద చెత్తను తొలగించారు. ట్రాక్టర్ సహాయంతో చదును చేయించి పరిసరాలను బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.  మురుగునీటి కాలువలో పూడిక తీయించి నిలిచిన నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కాలనీవాసులకు ఇబ్బందిగా మారిన చెత్త, మురుగునీరు రోడ్లపై రాకుండా ముమ్మర చర్యలు చేపట్టడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.