ఉత్తరాంధ్ర.. ఆంధ్రరాష్ట్రానికి పవర్ ఇంజిన్
విజయనగరం: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) నడిచిన ప్రాంతం.. ఉత్రరాంధ్ర అని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం(భోగాపురం)లో లోకేశ్ మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర ప్రజల కలలను సాకారం చేస్తున్నామని తెలిపారు.
నమో కా మతలబ్(Namo ka Matlab).. హిమ్మత్, విశ్వాస్, సురక్షిత్ భారత్, దుశ్మన్ కో ఢర్ అన్నారు. నమో సహకారంతో ఏపీలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను(Visakhapatnam Steel Plant) కాపాడారని లోకేశ్ తెలిపారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర అన్నారు. శరవేగంగా విమానాశ్రయం నిర్మించిన జీఎంఆర్ కు లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఏపీకి పవర్ ఇంజిన్ గా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు భవిష్యత్తులో తగ్గుతాయని వివరించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సూచించారు.






