గజ్వేల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
- మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి రూ. 1.13 లక్షల జరిమానా
- ట్రాఫిక్ సి ఐ సత్యనారాయణ హెచ్చరించారు.
గజ్వేల్: గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు గత వారం నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 19 మందిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి గౌడ్ మొత్తం రూ.1.13 లక్షల జరిమానా విధించినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ తెలిపారు. అదనంగా పలువురికి 2 నుంచి 4 రోజుల వరకు జైలు శిక్షలు విధించారన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 9 మందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ హెచ్చరించారు.






