23 May, 2026 | 4:54 PM

వడదెబ్బతో ఒకరు మృతి

23-05-2026 03:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆరవ వార్డు సుభాష్ నగర్ కు చెందిన న్యాతరి మొండయ్య (76) వడదెబ్బతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొండయ్య ఇంటిలోనే ఉంటూ తీవ్ర ఎండ వేడిమి తట్టుకోలేకుండా వడదెబ్బతో మృతి చెందినట్లు కుమారుడు మహేష్ శనివారం తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొండయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా కుల పెద్దమనిషి మొండయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.