5 May, 2026 | 6:33 AM

సన్ టీవీ షేర్లు డమాల్

05-05-2026 01:14 AM

రాజకీయ మద్దతు తగ్గుదల భయంతోనే నష్టం

చెన్నై, మే 4: తమిళనాడులో  టీవీకే ఘన విజయం సాధించి, అధికార డీఎంకే ఓడటంతో ఆ పార్టీ మీడి యా సంస్థగా పేరున్న సన్ టీవీ నెట్‌వర్క్ షే ర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మార్కెట్ ముగిసే సమయాని కి 5.38 శాతం నష్టంతో రూ. 573 వద్ద ముగిసిం ది.. సన్ టీవీ యజమాని కళానిధి మారన్ స్టాలిన్‌కు దగ్గరి బంధువు కావడంతో షేర్లు పతనం అయినట్లు భావిస్తున్నారు.

సన్ టీవీకి రాజకీయ మద్దతు తగ్గుతుందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలవైపు మొగ్గుచూపలేదు. దీంతో సన్‌టీవీ 52 వారాల కనిష్ఠ ధర రూ. 480. 20గా ఉంది. మరోవైపు స్టాక్ మార్కె ట్ ముగిసే సరికి సెన్సెక్స్ 77269. 40 (0.46 శాతం) లాభపడగా, నిఫ్టీ 50 24119.30 75 (0.51 శాతం) లాభాల్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 54878.50 (0.03) శాతం లాభపడగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 60159.75 374.9 (0.63) శాతం లాభాల్లో ముగిసింది.