21 July, 2026 | 3:40 PM

Breaking News

విజయవంతమైన వైద్యశిబిరం

20-07-2026 01:16 AM

రాజాపూర్ జూలై 19: మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని  గ్రామ సర్పంచ్ రేవతి ఆనంద్ తెలిపారు. ఆదివారం ప్రముఖ హాస్పిటల్  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

అలాగే బీపీ షుగర్ టెస్టులు చేసి దాదాపు 200 మంది రోగులకు మందులు అందజేసినట్లు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు డాక్టర్ మౌనిక,డాక్టర్ మారుతి రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించారు.సర్పంచ్ రేవతి,బిజెపి మండల అధ్యక్షులు ఆనంద్, వార్డు మెంబర్లు మహేష్,నరేష్,సువర్ణ పోచయ్య, మాజీ డిప్యూటీ సర్పంచ్ రాములు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,ప్రేమ్ కుమార్, శ్రీను విజయ్,కాశీం, వెంకట్రాములు, శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నరు.