2 May, 2026 | 1:07 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

కంటెంట్ ఉన్న మృత్యుంజయ్‌ని సక్సెస్ చేయండి

06-03-2026 12:00 AM

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన తాజాచిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి శ్రీవిష్ణు సరసన కథానాయికగా అలరించనుంది.

శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్న క్రమంలో గురువారం ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటుచేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మృత్యుంజయ్’ ప్రీమియర్ షోను అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్ ప్రారంభమైంది. తారక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నాని రాత్రి మూవీ చూసి మెచ్చుకున్నారు. కంటెంట్ ఉన్న ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘మా సినిమా పట్ల మేం ఎంతో గర్వంగా ఉన్నామ’ని కథానాయకి రెబా మోనికా జాన్ తెలిపారు.

డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ.. “శ్రీవిషు ఈ చిత్రంలో రిపోర్టర్‌గా నటించారు. ఆయన నటన చాలా కొత్తగా ఉంటుంది. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు. సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది” అన్నారు. నిర్మాత సందీప్ మాట్లాడుతూ.. “ఈ మూవీ కోసం మా టీమ్ నిద్రలేని రాత్రులు గడిపి పనిచేసింది. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు సుదర్శన్, అయ్యప్పశర్మ, రచ్చ రవి, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఏ దత్, రమ్య పాల్గొన్నారు.