6 March, 2026 | 3:50 AM

ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్

06-03-2026 12:00 AM

పవన్‌కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్‌శంకర్ తెరకెక్కిస్తు న్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.ఇందులో శ్రీలీల, రాశిఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా, పార్థిబన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా పాటలను దేవిశ్రీప్రసాద్ స్వరపర్చగా, నేపథ్య సంగీతం బాధ్యతలను తమన్‌కు అప్పగించారు మేకర్స్. ఉగాది సంద ర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్లు తాజా గా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రా నికి కూర్పు: కార్తిక శ్రీనివాస్; కళ: ఆనంద్ సాయి.