29 August, 2026 | 10:36 PM

కామారెడ్డి బల్దియా సమావేశంలో మళ్లీ కౌన్సిలర్ల రచ్చ

29-08-2026 09:57 PM

పోడియం వద్ద బైఠాయించిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు

కాంగ్రెస్ కౌన్సిలర్ లు కుర్చీలను ఎత్తివేసి నిరసన

దీంతో సంయమనం కోల్పోయిన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్ లు

పోలీసుల రంగ ప్రవేశం

ప్రత్యేక అధికారి రాకతో సద్దుమణిగిన వివాదం 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి బల్దియా సమావేశం మళ్లీ కౌన్సిలర్ ల రచ్చతో కొనసాగింది. పోలీసుల రంగ ప్రవేశం చేసే వరకు రచ్చ కొనసాగింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన ఆరు ఎజెండా అంశాలతో బల్దియ సమావేశాన్ని ప్రారంభించారు. బిఆర్ఎస్ కౌన్సిలర్ అరకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా వార్డు అధికారులు పనులు చేయించడం ప్రశ్నించారు. దీంతో రగడ మొదలైంది. ప్రశాంతంగా జ రగాల్సిన సమావేశం సమస్యల ఏకరు లేకుండానే రచ్చ చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అంజద్ కుర్చీని ఇసిరి వేయడంతో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదామ్ చోటు చేసుకుంది.

మున్సిపల్ కమిషనర్ను బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నిస్తూ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు రెచ్చిపోయారు. ప్రతి సమావేశాన్ని బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్ లు రచ్చ చేస్తూ సమావేశంలో సమస్యలను వివరించకుండానే చేస్తున్నారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిజెపి కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, ల మూడు పార్టీల కౌన్సిలర్లు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ సమావేశాన్ని రణ రంగంగా  మార్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ విషయం మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆర్డిఓ ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై వి గిరి వచ్చి కౌన్సిలర్లను సముదాయించారు.

అన్ని వార్డులలో సమస్యలను పరిష్కరించడం లేదని బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఆరు ఏజెండా అంశాలను సమావేశంలో చర్చించాల్సి ఉండగా కౌన్సిలర్ల మధ్య రగడ కావడంతో అధికారులు ఆందోళన చెందారు. ప్రతి పనికి షబ్బీర్ అలీ పేరు నయీమ్ పేరు చెప్పడం ఏమిటి అని అధికారుల తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్ లు సమావేశంలో ప్రశ్నించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి పట్టణ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉండగా కేవలం తమ నేతల అడుగుజాడల్లో నడవడం ఏమిటని బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. సంయమనం పాటించాలని కౌన్సిలర్లకు ప్రత్యేక అధికారి ఎన్వై గిరి సూచించారు.

ఎజెండాలోని అంశాలు చర్చిద్దామని పేర్కొనడంతో కౌన్సిలర్లు మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కామారెడ్డిలో వర్షాల వల్ల మూడు కాలనీలో నష్టం జరిగిందని రోడ్డు డివైడర్లు , రోడ్లు ధ్వంసం అయ్యాయి. వాటి మరమ్మతులు చేపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి చూసినా కూడా అభివృద్ధి పనులు జరగడం లేదని బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. కౌన్సిలర్గా ఎన్నికై ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక పని కూడా చేయ నీది ఎందుకు అంటూ కాలనీవాసులతో తిట్లు తింటున్నామని బీఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్ లు సభ దృష్టికి తెచ్చారు. ప్రతి దాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ రచ్చ చేసి సమావేశం జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు.

బిజెపి ఎమ్మెల్యే ఉండి ఏం చేశారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని సంయమనం కోల్పోయారు. మున్సిపల్ కమిషనర్ పర్వతాలు ఏజెండ అంశాలను చదివేoదుకు ప్రయత్నించగా కౌన్సిలర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డుల్లో మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నారని బిఆర్ఎస్, బిజెపి వార్డుల్లో అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు నోటీసులు డబ్బులు దండుకుంటున్నారని బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. దీంతో మళ్లీ రగడ జరిగింది. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్ సంయమనం కోల్పోయి సమావేశాన్ని మమ అనిపించారు. సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.