17 August, 2026 | 8:52 PM

మెనూ ప్రకారం భోజనం పెట్టాలని విద్యార్థుల ధర్నా...

17-08-2026 07:49 PM

- వర్కర్ ను తొలగించిన అధికారులు 

- మెనూ పాటించని వారిపై చర్యలు ఏవి...?

- సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ 

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మెనూ ప్రకారం భోజనం పెట్టాలని విద్యార్థుల ధర్నా చేస్తే సహకరించిన వర్కర్ ను అధికారులు తొలగించడం అన్యాయమని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. సీఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలోని బిసి బాలుర కళాశాల వసతి గృహ విద్యర్థులు వార్డెన్ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ గత నెలలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ధర్నాపై అధికారులు విచారణ చేసి విద్యార్థుల ధర్నా ఫొటోస్, వీడియోస్ తన ఫోన్ నుంచి ఇతరులకు పంపించినందుకు హాస్టల్ కామటి మెహర్ బాబాపై చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. సమస్యలు చెప్పిన వారినే అధికారులు తొలగిస్తున్నారని, బిసి అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.