ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి
14-05-2026 04:32 PM
సర్పంచ్ కలకోట్ల శైలేందర్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే14:ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించాలని సర్పంచ్ కలకోట్ల శైలేందర్ అన్నారు.గురువారం మండలంలోని అడివెంల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,నాణ్యమైన మధ్యాహ్న భోజనం,యూనిఫామ్ లను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జె చిన్నరవి,హెచ్ఎం యాదమ్మ,ఉపాధ్యాయులు విజయలక్ష్మి,కరుణ,వార్డు సభ్యులు రవి,విద్యార్థులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






