20 August, 2026 | 1:03 PM

శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన

20-08-2026 11:48 AM

హైదరాబాద్: యూసఫ్ గూడలో దుర్గాబాయి దేశ్ ముఖ్ పాలిటెక్నిక్(Students of Durgabai Deshmukh Polytechnic)  విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాలిటెక్నిక్ విద్యలో శక్తి విధానాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి విధానం వల్ల నేరుగా బీటెక్ చదివే అవకాశం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసెట్ రాసి బీటెక్ సీట్లు పొందే పాత విధానాన్ని అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. శక్తి విధానం(Sakthi policy) కోసం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్ వీనాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేస్తున్నారు. శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ పటాన్ చెరు చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. శక్తి విధానాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి విద్యార్థులే వినతి పత్రం ఇచ్చారు.