రాష్ట్ర స్థాయి అర్చెరీ పోటీలకు పారమిత విద్యార్థి
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఇటీవల కరీంనగర్ జిల్లా అర్చెరీ అసోషియేషన్ ఆద్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-13 అర్చెరీ చాంపియన్ షిప్ పోటీలలో పారమిత హెరిటేజ్ విద్యార్థి తుమ్మ ఇషాన్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిబంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి అర్చెరీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు తెలిపారు.
ఈ నెల 8న హైద్రాబాద్ లోని పటాన్ చెరువులో తెలంగాణ రాష్ట్ర అర్చెరీ అసోషియేషన్ ఆద్వర్యంలో జరగనున్న అర్చెరీ అండర్-13 బాలుర చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నాడని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఇషాన్ ను పారమిత విద్యాసంస్థల అధినేత డా. ఇ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, వి.యు.యం. ప్రసాద్, హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్ నిఖిత, పి.ఇ.టి. లు యస్. రాజు, జె. శ్రీనివాస్ లు అభినందించారు.




